Skip to Content

బ్యాలెట్ డ్రాప్ బాక్స్

Drop Box

మెయిల్ ద్వారా ఓటు డ్రాప్ బాక్స్ ప్రోగ్రామ్ గురించి

మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ డ్రాప్ బాక్స్ ప్రోగ్రాం 2017లో ఓటర్లకు వారి బ్యాలెట్‌ను వాపసు చేయడానికి సురక్షితమైన ప్రత్యామ్నాయ ఎంపికను అందించడానికి ఒక చొరవగా ప్రారంభించబడింది.

బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లు ఓటర్లకు తమ ఓటు వేసిన బ్యాలెట్‌ను వాపసు చేయడానికి సురక్షితమైన, యాక్సెస్ చేయగల మరియు కాంటాక్ట్ ఫ్రీ పద్ధతిని అందిస్తాయి.


మీరు తెలుసుకోవలసినది

  • డ్రాప్ బాక్స్‌లు ఎలక్షనుకు 29 రోజుల ముందు మరియు ఎలక్షన్ రోజున ఓటర్లకు అందుబాటులో ఉంటాయి
  • డ్రాప్ బాక్సులు ఎలక్షన్ రోజున రాత్రి 8 గంటలకు మూసివేయబడతాయి
  • డ్రాప్ బాక్స్‌లు సిమెంట్‌లో సురక్షితంగా బోల్ట్ చేయబడతాయి లేదా చైనుతో భద్రపరచబడతాయి
  • రాష్ట్ర నిబంధనలలో గుర్తించబడిన సెక్యూరిటీ ఫీచర్స్ (భద్రతా అంశాల)తో డ్రాప్ బాక్స్‌లు రూపొందించబడ్డాయి
  • పర్మనెంట్ గ్రాఫిటీ లేదా నష్టాన్ని తగ్గించడానికి డ్రాప్ బాక్సులకు ఔటర్ (బాహ్య) కోటింగ్ ఉంటుంది
  • క్రమం తప్పకుండా ఇద్దరు ఎలక్షన్ వర్కర్ల ద్వారా బ్యాలెట్లు సేకరించబడతాయి
  • అన్ని బాక్సులను పర్యవేక్షించడానికి మరియు భద్రపరచడానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, నగరాలు, స్థానిక వాటాదారులు మరియు కమ్యూనిటీ-ఆధారిత సంస్థలతో కౌంటీ పని చేస్తుంది

బ్యాలెట్ వాపసు చెక్‌లిస్ట్

మీ మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను వాపసు చేసే ముందు మీరు నిర్ధారించుకోవలసినది:

  • మీ ఓటు వేసిన బ్యాలెట్ కార్డు(ల)ని అధికారిక వాపసు ఎన్వలప్‌లో ఉంచండి
  • అధికారిక వాపసు ఎన్వలప్‌ను సురక్షితంగా సీల్ చేయండి
  • అధికారిక వాపసు ఎన్వలప్ వెనుక సంతకం చేసి తేదీ వేయండి

మీ బ్యాలెట్ అందుకోబడి మరియు లెక్కించబడిందో లేదో ఎలా చెక్ చేయాలి

మీరు డ్రాప్ బాక్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా మీ ఓటు వేసిన బ్యాలెట్‌ను వాపసు చేసిన తరువాత మీ బ్యాలెట్‌ అందుకోబడినదని మరియు లెక్కించబడినదని నిర్ధారించుకోవడానికి మా మెయిల్ ద్వారా ఓటు స్టేటస్ టూల్ ద్వారా చెక్ చేయవచ్చు.


బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌తో ఉన్న సమస్యను రిపోర్ట్ చేయండి

పారదర్శకంగా మరియు అందుబాటులో ఉండే పద్ధతిలో అన్ని ఎలక్షన్ల సమగ్రతను నిలబెట్టడం మా లక్ష్యం. మీకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, రిపోర్ట్ చేయండి!

సమస్యను రిపోర్ట్ చేయండి


ఎలక్షన్ ప్రచారం నిషేధించబడింది!

ఉల్లంఘనలు జరిమానాలు మరియు/లేదా జైలు శిక్షకు దారి తీయవచ్చు.

ఎక్కడ:

  • ఒక వ్యక్తి బ్యాలెట్ వేయడానికి లైనులో ఉన్నప్పుడు వారికి సమీపంలో లేదా పోలింగ్ స్థలం యొక్క ప్రవేశ ద్వారం, సైడ్ వాక్ ఓటింగ్ లేదా డ్రాప్ బాక్స్ నుండి 100 అడుగులలోపు క్రింద పేర్కొన్న కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.

ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి:

  • ఒక వ్యక్తిని ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని అడగవద్దు.
  • అభ్యర్థి పేరు, ఫోటో లేదా లోగోను ప్రదర్శించవద్దు.
  • ఏ బ్యాలెట్ డ్రాప్ బాక్సులకైనా యాక్సెస్‌ (ప్రాప్యత)ను నిరోధించడం లేదా దగ్గరలో సంచరించడం వంటివి చేయవద్దు.
  • ఏదైనా పోలింగ్ స్థలం, ఓటు సెంటర్ లేదా బ్యాలెట్ డ్రాప్ బాక్స్ సమీపంలో ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎటువంటి సామాగ్రి లేదా వినగల సమాచారాన్ని అందించవద్దు.
  • చొరవలు, ప్రజాభిప్రాయ సేకరణలు, తొలగింపు లేదా అభ్యర్థుల నామినేషన్లతో సహా ఎలాంటి పిటీషనుల పంపిణీ చేయవద్దు.
  • అభ్యర్థి పేరు, ఫోటో, లోగో మరియు/లేదా ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి దుస్తులను (టోపీలు, చొక్కాలు, గుర్తులు, బటన్లు, స్టిక్కర్లు) పంపిణీచేయడం, ప్రదర్శించడం లేదా ధరించడం చేయవద్దు.
  • ఓటు వేయడానికి ఓటరు అర్హతల సమాచారాన్ని ప్రదర్శించడం లేదా ఓటరుతో మాట్లాడటం చేయవద్దు.
  • పైన సంక్షిప్తీకరించబడిన ఎలక్షన్ నిషేధాలు California ఎలక్షన్స్ నియమావళి ఆర్టికల్ 7లోని 18వ విభాగం యొక్క 4వ అధ్యాయంలో నిర్ధేశించబడ్డాయి.

ఓటింగ్ ప్రక్రియలో అవినీతి నిషేధించబడింది!

ఉల్లంఘనలు జరిమానా మరియు/లేదా జైలు శిక్షకు లోబడి ఉంటాయి.

ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి:

  • ఎలక్షనులో మోసానికి పాల్పడవద్దు లేదా ప్రయత్నించవద్దు.
  • ఒక వ్యక్తికి ఓటు వేయడానికి లేదా ఓటు వేయకుండా ఉండటానికి, ఏ పద్ధతిలోనైనా లేదా ఏ విధంగానైనా ప్రేరేపించడానికి లేదా ప్రేరేపించేందుకు ప్రయత్నించడానికి ఎలాంటి పరిహారం లేదా లంచం అందించటం చేయవద్దు.
  • చట్టవిరుద్ధంగా ఓటు వేయవద్దు.
  • ఓటు వేసే అర్హత లేనప్పుడు ఓటు వేయడానికి ప్రయత్నించడం లేదా మరొకరికి ఓటు వేయడంలో సహాయం చేయడం లాంటివి చేయవద్దు.
  • ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం; ఒక ఓటరు పోలింగ్ స్థలంలోకి ప్రవేశించడం లేదా నిష్క్రమించేటప్పుడు ఫోటోతీయడం లేదా రికార్డు చేయడం; లేదా ప్రవేశించడం, బయటికి వెళ్లడం లేదా పార్కింగ్‌ను అడ్డుకోవడం వంటివి చేయవద్దు.
  • ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కును సవాలు చేయడం లేదా ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించడం; ఓటింగ్ ప్రక్రియను ఆలస్యంచేయడం; లేదా మోసపూరితంగా ఏ వ్యక్తికైనా అతనికి లేదా ఆమెకు ఓటు వేసే అర్హత లేదని లేదా ఓటు వేయడానికి నమోదు చేసుకోలేదని సలహా ఇవ్వడం వంటివి చేయరాదు.
  • ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు.
  • కొన్ని మినహాయింపులతో, పోలింగ్ స్థలానికి సమీపంలో తుపాకీని కలిగి ఉండడం లేదా ఎవరికైనా తుపాకీని కలిగి ఉండేలా ఏర్పాట్లు చేయవద్దు.
  • కొన్ని మినహాయింపులతో, పోలింగ్ స్థలానికి సమీపంలో శాంతి అధికారి, గార్డు లేదా భద్రతా సిబ్బంది యూనిఫారంలో కనిపించడం లేదా ఎవరైనా కనిపించేలా ఏర్పాట్లు చేయడం వంటివి చేయవద్దు.
  • ఓటింగ్ సిస్టమ్ లోని ఏ భాగాన్నైనా ట్యాంపర్ (తారుమారు) చేయడం లేదా అంతరాయం కలిగించవద్దు.
  • బ్యాలెట్ల వాపసును ఫోర్జరీ చేయడం, అబద్ధీకరించడం లేదా ట్యాంపర్ (తారుమారు) చేయవద్దు.
  • బ్యాలెట్ల వాపసును మార్చవద్దు.
  • ఏదైనా పోలింగ్ జాబితా, అధికారిక బ్యాలెట్ లేదా బ్యాలెట్ కంటైనరును ట్యాంపర్ (తారుమారు), నాశనం లేదా మార్చడం చేయవద్దు.
  • అధికారిక కలెక్షన్ బాక్స్ అని విశ్వసించేలా ఓటరును మోసగించే ఏదైనా అనధికారిక బ్యాలెట్ కలెక్షన్ కంటైనరును ప్రదర్శించవద్దు.
  • పోల్ అయిన ఓట్ల ఫలితాల కాపీని ట్యాంపర్ చేయడం లేదా జోక్యం చేసుకోవడం వంటివి చేయవద్దు.
  • చదవలేని వ్యక్తిని లేదా వృద్ధులను వారి ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఒక అభ్యర్థికి లేదా డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయడానికి బలవంతం లేదా మోసగిండం వంటివి చేయవద్దు.
  • మీరు ఒక ఎలక్షన్ అధికారి కానప్పుడు, ఎలక్షన్ అధికారి వలె ప్రవర్తించవద్దు.
  • ఎంప్లాయర్లు తమ ఉద్యోగిని వారి మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును కార్యాలయానికి తీసుకురావాలని లేదా ఉద్యోగిని కార్యాలయం వద్ద తమ బ్యాలెట్లో ఓటు వేయమని అడగలేరు. జీతం లేదా వేతనాలు చెల్లించే సమయంలో, యజమానులు తమ ఉద్యోగి యొక్క రాజకీయ అభిప్రాయాలు లేదా చర్యలను ప్రభావితం చేసే సామాగ్రీలను జతపరచలేరు.
  • ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రిసింక్ట్ బోర్డు సభ్యులు ప్రయత్నించలేరు లేదా, ఆ సమాచారం తెలిసినట్లయితే, ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారనే విషయాన్ని వారు వెల్లడించలేరు.
  • పైన సంగ్రహించబడిన ఓటింగ్ ప్రక్రియ యొక్క అవినీతికి సంబంధించిన కార్యాచరణపై నిషేధాలు California ఎలక్షన్ నియమావళి 18వ విభాగంలోని 6వ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి.

ఈ సమాచారాన్ని pdf ఫార్మాట్‌లో చూడడానికి లేదా డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

Icon - Close